![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -466 లో... కళ్యాణ్ మెడిటేషన్ చేస్తుంటాడు. ధాన్యలక్ష్మి చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే ప్రకాష్ జాగింగ్ నుండి వస్తుంటాడు. తనని ధాన్యలక్ష్మి ఆపి.. కళ్యాణ్ ని చూపిస్తుంది. చూసారా ఇప్పటికి వాడు అన్ని మర్చిపోయి మాములుగా అయ్యాడని ధాన్యలక్ష్మి చెప్పగానే ప్రకాష్ వెటకారంగా మాట్లాడతాడు. అంటే ఇన్ని రోజులు మాములుగా లేడా అంటూ సెటైర్ వేస్తాడు. ఆ తర్వాత రాజ్ వచ్చి కళ్యాణ్ ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ.. డిస్టబ్ చెయ్యకూడదంటూ లోపలికి వెళ్లిపోతాడు.
ఆ తర్వాత కావ్య కూడా కళ్యాణ్ ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. కావ్య కళ్యాణ్ కి జ్యూస్ తీసుకొని వెళ్తుంది. మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇలా ఉంటేనే ఇల్లంతా బాగుంటుందని కావ్య చెప్పి లోపలికి వెళ్తుంది.లోపలికి వెళ్ళగానే కావ్యని రాజ్ భయపెడతాడు. కావ్య చిరాకుగా లోపలికి వెళ్ళిపోతుంది. రాజ్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి గతం చేసిన గాయాన్ని తలుచుకుంటే భవిష్యత్తు బాగుండదని సలహా ఇస్తాడు. మీరు చెప్పింది దాని గురించి అలోచించి పాత జ్ఞాపకాలు నుండి బయటకు వస్తున్నానని కళ్యాణ్ అంటాడు.
మరొకవైపు రాత్రి నిద్ర పోనట్టున్నావని ఇందిరాదేవి కావ్య దగ్గరికి వచ్చి అడుగుతుంది. మీ మనవడు నిద్ర పోనిస్తే కదా అని కావ్య అనగానే.. అవునా అంటూ ఇందిరాదేవి నవ్వుతుంటే. అంటే రాత్రంతా గొడవపెట్టుకోవడానికే సరిపోయిందని కావ్య అంటుంది. ఇక అక్కడే ఉన్న అపర్ణ కావ్యపై కోప్పడుతుంది. నీకు ఏమని చెప్పి పంపించినా.. నువ్వు ఏం చేసావని అపర్ణ అడుగుతుంది. ఒళ్ళంతా ఇగో ఉన్నవాడితో ఏం మాట్లాడుతామని కావ్య చెప్తుంది. ఇందిరాదేవి, అపర్ణలకి కావ్య జరిగింది మొత్తం చెప్తుంది. అప్పుడే రాజ్ వస్తాడు. నేను వాడితో మాట్లాడతానంటూ ఇందిరాదేవి మాట్లాడుతుంది. నేను చెప్పిందేంటి? నువ్వు చేస్తుందేంటని ఇందిరాదేవి రాజ్ ని తిడుతుంది. కావ్య త్వరలోనే నెల తప్పాలంటూ రాజ్ కి వార్నింగ్ ఇస్తుంది ఇందిరాదేవి.
మరొకవైపు రాహుల్ తన గర్ల్ ఫ్రెండ్స్ కి కాల్ చేస్తే బిజీ రావడంతో.. స్వప్నని చూసి ఇది కూడా బానే ఉందంటూ రొమాంటిక్ గా దగ్గరికి వస్తుంటే.. నువ్వు మనిషిగా మారినప్పుడు నా దగ్గరికి రా అని రాహుల్ పై స్వప్న కోప్పడుతుంది. ఆ తర్వాత కావ్య మొక్కలకి నీళ్లు పోస్తుంటే.. తనతో మాట్లాడాలని రాజ్ ట్రై చేస్తుంటాడు. మళ్ళీ ఇద్దరు టామ్ అండ్ జెర్రీలాగా వాదించుకుంటూ ఉంటారు. అదంతా రుద్రాణి చూస్తూ.. ఏంటి వీడు ప్రొద్దున నుండి కావ్య వెనకాలే తిరుగుతున్నాడని అనుకుంటుంది. తరువాయి భాగంలో కావ్యని రాజ్ డిన్నర్ కి తీసుకొని వెళ్తాడు. అక్కడ మేనేజర్.. రాజ్ గారు తన వైఫ్ కి సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారని చెప్తాడు. దాంతో కావ్య ఆశ్చర్యంగా చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |